చికెన్ మసాలకు బదులు గుళికలు… ఇద్దరు చిన్నారులు మృతి

చికెన్ మసాలకు బదులు గుళికలు... ఇద్దరు చిన్నారులు మృతి

0
140

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది… తన మనవళ్లు ఇంటికి వచ్చారని సంతోషంతో అమ్మమ్మ చికెన్ తెచ్చింది… అయితే ఆ చికెన్ తిన్న మనవళ్లు మృతి చెందారు… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

చిత్తూరు జిల్లా రూరల్ మండలం బ్రాహ్మణ పల్లె గ్రామానికి చెందిన ఇద్దరు పిల్లలు సెలవులు కావడంతో ఏఎల్ పురంలోని తన అమ్మమ్మ ఇంటికి వచ్చారు… దీంతో రాక రాక వచ్చిన తన మనవళ్లకు అమ్మమ్మ చికెన్ తెచ్చి వారికి తన ప్రేమను పంచాలని చూసింది…

అయితే వంటగదిలో అమె చికెన్ మసాలకు బదులు గుళికల మందు బిల్లలు వేసింది… దీంతో చికెన్ కలుషితం అయింది… ఇక దాన్ని తిన్న మనవళ్లు మృతి చెందారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు… పిల్లల అమ్మమ్మకు మతిమరుపుతో చికెన్ మసాలకు బదులు గుళికలను వేసిందని తెలింది…