చెన్నకేశవుల భార్య సంచలన కామెంట్లు

చెన్నకేశవుల భార్య సంచలన కామెంట్లు

0
94

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శంషాబాద్ దిశ హత్యాచారం కేసు లో దోషులుగా వున్న నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే, అందులో నిందితుడు చెన్నకేశవులు భార్య రేణుక తీవ్రస్ధాయిలో పోలీసులపై విమర్శలు చేసింది,ఈ దారుణమైన ఘటనలో మరికొందరి హస్తం ఉందని ఆమె విమర్శించింది, అంతేకాదు పోలీసులపై ఒత్తిడి వచ్చిందని వారు డబ్బున్న వారు పెద్ద కులానికి చెందిన వారు పోలీసులకు డబ్బు ఇచ్చి ఆమె తండ్రి నా భర్తని చంపించేశాడు. అసలు నా భర్త సింగిల్ గా లారీ మీద పనికి వెళ్లినా ఏ అమ్మాయి జోలికి వెళ్లలేదు.

15 రోజులు అయినా ఎలా వెళ్లాడో అలాగే వచ్చేవాడు. నాకు నా భర్తపై నమ్మకం ఉంది. ఆరోజు ఆ ముగ్గురితో కలిసి వెళ్లి ఇంత దారుణం చేశాడు అని ఆమె విమర్శించింది, నా భర్తపై అలాగే మరో ముగ్గురిపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించారు వేడి నీళ్లు కొట్టి శరీరంపై దెబ్బలు కొట్టారు వారు పోలీసుల దగ్గర గన్స్ తీసుకుని ఎలా పారిపోతారు, ఇవన్నీ బూటకపు కాల్పులు కావాలనే పోలీసులు నా భర్తని చంపేశారు, నాకు ఉద్యోగం అయినా ఆర్దిక భరోసా అయినా ప్రభుత్వం ఇవ్వాలి.

నా బిడ్డని ఎలా పోషించుకోవాలి అని ఆమె మీడియా ముందు వాపోయింది. అయితే ఆమె వాదన పై పలువురు విమర్శలు చేస్తున్నారు, ఇదే దారుణం నీ చెల్లికో నీ అక్కకో జరిగితే ఏం చేస్తావు అని కొందరు ప్రశ్నిస్తున్నారు, మరికొందరు మాత్రం పోలీసులు వారికి ఉరిశిక్ష వేయాల్సింది అని తెలియచేస్తున్నారు. అయితే ఆమె చేస్తున్న కామెంట్లు కూడా ఇప్పుడు పెద్దగా వైరల్ అవుతున్నాయి.