చేపలకు సంతాపం చెప్పడం ఏమిటి, రోజు లక్షలాది చేపలు కోసుకుని తింటాం కదా అని అనుమానం రావచ్చు, అయితే ఇక్కడ ఈ చేప లక్కీ చేప, దీనిని ఒకసారి చూసి ఒకసారి పరీక్ష రాస్తే పాస్ అవ్వాల్సిందే, ఉద్యోగానికి వెళితే ఉద్యోగం రావాల్సిందే, అంత లక్కీ చేప అందుకే దీనికి దేశంలో అంత పేరు వచ్చింది.
ఆ ఫిష్ పేరు మాఫీషి. ఇది జాంబియాలోని కాపర్ బెల్ట్ యూనివర్శిటీలోని చెరువులో ఉంటోంది. గత 20 ఏళ్లుగా అక్కడ నివసిస్తోంది. ఈ చేపను యూనివర్శిటీ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది చాలా అపురూపంగా చూసుకుంటారు. మనం తినే మరమరాలు లాంటివి అలాగే అనేక రకాల ఫుడ్ కూడా ఆ విద్యార్దులు చేపకు వేస్తూ ఉంటారు.
దీంతో అది హ్యాపీగా చెరువులో ఇరవై సంవత్సరాల నుంచి ఉంది, అయితే ఈరోజు అది చనిపోయింది, కారణం తెలియదు కాని చనిపోయి చెరువులో తేలింది. దీంతో కాపర్ బెల్ట్ యూనివర్శిటీ క్యాండిల్ లైట్స్ తో సంతాపం తెలిపింది.
ఈ విషయం జాంబియా అధ్యక్షుడికి తెలిసింది. యూనివర్శిటీలోని లక్కీ ఫిష్ గురించి తెలుసుకున్నాడు. మాఫీషి మరణం పట్ల సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశాడు. ఇక ఆయన ట్వీట్ పెట్టడంతో దేశం అంతా ఈ చేప గురించి తెలిసింది…ఇలా ప్రపంచం అంతా ఈ చేప వార్త వైరల్ అయింది.
మరో విషయం ఏమిటి అంటే, విద్యార్దులు అక్కడ మాస్టార్టు, ఈ చేపను ఖననం చేయకుండా కెమికల్స్ లో భద్రపరిచారు.