పెద్దలు చెప్పే ఆనవాయితీ చెట్లు అంటే ఏమిటి దాని చరిత్ర ?

పెద్దలు చెప్పే ఆనవాయితీ చెట్లు అంటే ఏమిటి దాని చరిత్ర ?

0
91

చాలా మంది పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు.. మన ఇంటి పెరట్లో మనకు ఆనవాయితీ ఉన్న మొక్కలు మాత్రమే వెయ్యాలి.. మనకు ఆనవాయి లేని మొక్కలు పెంచద్దు అంటారు.. ఇది ఏనాటి నుంచో వినిపిస్తున్న మాట.. మరీ ముఖ్యంగా తాతలు బామ్మలు పెద్ద పెద్ద పెరటి ఉన్న ఇళ్లల్లో వాళ్ల ఇంటి ఆనవాయి ఉన్న మొక్కలు పెంచారు.

మరి అలా ఏ మొక్కలు ఇలా ఆనవాయిగా చూసుకుంటారు , నిజంగా ఇది ఇప్పటికీ చాలా మంది పాటిస్తున్న అంశమే. కొన్ని మొక్కలు ఇంట్లో వేయాలి అంటే కచ్చితంగా ఆనవాయి చూసుకుని మరీ గ్రామాల్లో వారి పెరట్లో వేస్తారు, మరి ఆ మొక్కలు ఏమిటో చూద్దాం.

1.. కరివేపాకు మొక్క
2.తమలపాకు పాదు
3. బూడిద గుమ్మడి పాదు
4. సీతాఫలం
5. నిద్ర గన్నేరు
6. గానుగ
8. అరటి ఇది చాలా ముఖ్యం ఆనవాయి లేకపోతే ఇప్పటీకీ పెరట్లో చాలా మంది పెంచరు
9.శంకం పూల చెట్లు
10. మునగాకు మొక్క

అయితే ఇది కేవలం ఇంటి పెరటికి మాత్రమే పరిమితం.. తోటల్లో పొలాల గట్ల దగ్గర మాత్రం ఇలాంటి సెంటిమెంట్ ఏనాడు లేదు అని చెబుతారు పెద్దలు..