చిన్న‌పిల్ల‌లు కారులో ఆడుకున్నారు చివ‌ర‌కు విషాదమైంది

చిన్న‌పిల్ల‌లు కారులో ఆడుకున్నారు చివ‌ర‌కు విషాదమైంది

0
106

చిన్న పిల్ల‌ల‌ను కంటికి రెప్ప‌లా చూసుకోవాలి లేక‌పోతే వారు చేసే ప‌నుల‌కి చాలా ఇబ్బంది ప‌డ‌తాం.. అంతేకాదు ఒక్కోసారి వారి ప్రాణాల మీద‌కి కూడా ఇవి వ‌స్తాయి, చివ‌ర‌కు వారిని ప‌ట్టించుకోకుండా మ‌నం మ‌న ప‌నిలో ఉంటే వారు చేసే ప‌నుల వ‌ల్ల ఏకంగా అది విషాదంగా మారే ఘ‌ట‌న‌లు ఉన్నాయి.

చిన్నారులు సరదాగా ఆడుకుంటూ..ఆడుకుంటూ అక్కడ పార్క్ చేసి ఉన్న కారులోకి ఎక్కేశారు. కానీ కారు డోర్లు తెరుచుకోకపోవటంత దిగలేకపోయి అలాగే ఊరిపి ఆడక అపస్మార స్థితికి వెళ్లిపోయారు. కారు ఎక్కి ఆడుకుంటున్న నలుగురు చిన్నారులు కారులో చిక్కుకుపోయి ఊపిరి ఆడక ఇద్దరు చనిపోయారు. ఈ విషాదం అక్క‌డ కుటుంబాల‌ను క‌న్న‌టి ప‌ర్యంతం చేసింది.

ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లా ముందపాండే ప్రాంతంలో జరిగిన ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించింది. ఇద్ద‌రు ఊపిరి ఆడ‌క చ‌నిపోతే మ‌రో ఇద్ద‌రు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు, వారు కారులోకి వెళ్ల‌డం డోర్ వేయ‌డం ఎవ‌రూ గుర్తించ‌లేదు దీంతో ఇంత దారుణం జ‌రిగింది..చిన్నారులంతా 4 నుంచి 7 సంవత్సరాలు ఉన్న వారే.