ఏసీబీకి చిక్కిన ‘సీఐ యమునాధర్ రావు’

0
92

ప్రస్తుతంకాలంలో లంచాలు తీసుకునే పనులు చేసే అధికారుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. ఇప్పటికే లంచాలు తీసుకుంటూ పట్టుబడిన అధికారులు చాలామందే ఉండగా..తాజాగా నల్గొండలో హాలియా ఎక్సైజ్ సీఐ యమునాధర్ రావుని రెడ్ హ్యాండెడ్ గా ఎసిబి అధికారులు పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళితే..హైదరాబాద్ సరూర్నగర్ లో వుండే నల్గొండ జిల్లా సాగర్ లోనిహిల్ కాలనీకి చెందిన నూకల విద్యాసాగర్ రెడ్డికి అతని భార్య సునీత పేరుమీద లాటరీ పద్దతిలో తిరుమలగిరి సాగర్ వైన్ షాప్ వచ్చింది. దాంతో విద్యాసాగర్ రెడ్డి ఆనందంగా షాప్ లో పనిచేసుకుంటూ భార్యాపిల్లలను పోషించుకుంటా ఉండొచ్చు అని అనుకుంటున్నా క్రమంలో హాలియా ఎక్ సైజ్ సిఐ తనకు నెలకు 25 వేల రూపాయలు ఇస్తేనే వైన్ షాపు సక్రమంగా నడుస్తుందని బెదిరించడంతో దానికి ఒకే చెప్పాడు విద్యాసాగర్ రెడ్డి.

ఈ క్రమంలో 8 నెలలకు గాను 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకుని ఎసిబిని విద్యాసాగర్ రెడ్డి ఆశ్రయించాడు. దాంతో నల్గొండ ఏక్సిజ్ స్టేషన్ వద్ద సిఐ వెంకటేశ్వర్లు వాహనంలో డబ్బులు పెట్టడంతో ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా సీఐ యమునాధర్ రావును పట్టుకున్నారు. అనంతరం సిఐ యమునాధర్ రావు అరెస్ట్ చేసి, నల్గొండ ఎక్ సైజ్ స్టేషన్ సిఐ వెంకటేశ్వర్లు వాహనం కూడా సీజ్ చేశారు.