నడి సముద్రంలో నౌకలోకి నీరు..19 మంది ప్రాణాలు కాపాడిన కోస్ట్ గార్డ్

0
107

మహారాష్ట్రలోని రత్నగిరి తీరం వద్ద సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నౌకలోకి నీరొచ్చింది. ఈ క్రమంలో ఓడ మునిగిపోతుంది అనే సమాచారం తెలుసుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది ఆపరేషన్ రెస్క్యూ నిర్వహించి 19 మంది ప్రాణాలు కాపాడారు. కోస్ట్ గార్డ్ సరైన సమయంలో స్పందించకుంటే నౌకతో సహా 19 మంది జలసమాధి అయ్యేవారు.