తెలంగాణ ప్రజలకు చల్లని కబురు

0
93

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. వేడి, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశమున్నట్లు తెలిపింది. అదే విధంగా గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో పాటు.. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా వరకు ఈ ఋతుపవనాలు విస్తరించాయి.

రాగల 48 గంటల్లో తెలంగాణలోని మరికొన్ని భాగాలు తదుపరి రెండు రోజుల్లో రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతు పవనాలు విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. కాగా ఇప్పటికే రైతులు విత్తనాలు వేయడానికి భూమిని సిద్ధం చేసుకొని విత్తనాలు సమకూర్చుకున్నారు. వాన కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.