ఏపీ నగర వాసులకు చల్లని కబురు.. మూడు రోజుల పాటు వర్షాలు..

0
111

ఎండలు అధికంగా పెరడంతో ప్రజలు అడుగు బయట పెట్టాలంటే జంకుతున్నారు. ముఖ్యంగా ఏపీ లో ఎండలు తీవ్రత అధిక స్థాయిలో ఉండడంతో..నగర వాసులు వదెబ్బకు గురవుతున్నారు. అందుకే ఎండ నుండి ఉపశమనం ఇచ్చే చల్లని కబురు ప్రకటించింది ఏపీ వాతావరణ శాఖ. ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తర తమిళనాడు తీరం వెంబడి ఉన్న, పశ్చిమ మధ్య బంగాళా ఖాతం ఉపరితల ఆవర్తనం, సగటు సముద్ర మట్టం మీద 1 . 5 కి .మీ & 3 . 6 కి .మీ మధ్య వ్యాపించి ఉన్నది. దీని కారణంగా  ఏపీ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల వరకు వర్షాలు ఉండనున్నాయి.

ఉత్తర కోస్తా ఆంధ్రలో ఈరోజు, రేపు మరియు ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఉన్నట్టు వాతావరణ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా ఆంధ్రలో ఈరోజు తేలికపాటి వర్షాలు, రేపు మరియు ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. రాయలసీమలో మాత్రం ఈరోజు, రేపు మరియు ఎల్లుండి ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.