Home SPECIAL STORIES మరికాసేపట్లో కానిస్టేబుల్ రాతపరీక్ష..అభ్యర్థులు తప్పక పాటించాల్సిన నియమాలు ఇవే..

మరికాసేపట్లో కానిస్టేబుల్ రాతపరీక్ష..అభ్యర్థులు తప్పక పాటించాల్సిన నియమాలు ఇవే..

0
94

 

తెలంగాణలో కానిస్టేబుల్‌ ప్రాథమిక రాతపరీక్ష మరికాసేపట్లో ప్రారంభం కానుంది. నేడు జరగనున్న ఈ పరీక్ష నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 1,601 కేంద్రాల్లో ఏర్పాట్లు చేపట్టింది ప్రభుత్వం.

 

అయితే ఈసారి 16,321 కానిస్టేబుల్‌ పోస్టుల కోసం ఏకంగా 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఇంత భారీఎత్తున కానిస్టేబుళ్ల నియామకాల కోసం పరీక్ష జరుగుతోంది. దీనితో తీవ్ర పోటీ నెలకొంది.

కీలక సూచనలు ఇవే..

అభ్యర్థుల్ని గంట ముందే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. ఉదయం 10 గంటలకే పరీక్ష కేంద్రం గేట్లు మూసేస్తారని మండలివర్గాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఒక నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండబోదు. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌ www.tslprb.in నుంచి హాల్‌టికెట్‌ను ఏ4సైజ్‌ పేపర్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న అనంతరం నిర్దేశిత స్థలంలో తప్పనిసరిగా అభ్యర్థి ఫొటోను గమ్‌తో అతికించుకోవాలి.

దరఖాస్తు చేసిన సమయంలో డిజిటల్‌ కాపీలో ఉంచిన ఫొటోనే తిరిగి వినియోగించాలి.

ఎట్టి పరిస్థితుల్లోనూ పిన్‌లు కొట్టొద్దు.ఫొటో లేకుంటే పరీక్షకు అనుమతించరు.

 బయోమెట్రిక్‌ విధానం అనుసరించనున్న నేపథ్యంలో అభ్యర్థుల చేతులకు మెహిందీ, టాటూలు ఉంచుకోకూడదు.

భ్యర్థి పరీక్ష గదిలోకి తనవెంట హాల్‌టికెట్‌తో పాటు బ్లూ లేదా బ్లాక్‌ పాయింట్‌పెన్‌ను మాత్రమే తీసుకెళ్లాలి.

సెల్‌ఫోన్‌, టాబ్లెట్‌, పెన్‌డ్రైవ్‌, బ్లూటూత్‌ డివైజ్‌, చేతిగడియారం, కాలిక్యులేటర్‌, లాగ్‌టేబుల్‌, వాలెట్‌, పర్స్‌, నోట్స్‌, చార్ట్‌, రికార్డింగ్‌ పరికరాలు, ఖాళీపేపర్లను వెంట తీసుకెళ్లరాదు.

 మహిళా అభ్యర్థులు నగలు ధరించకూడదు.

విలువైన వస్తువుల్ని భద్రపరిచేందుకు పరీక్ష కేంద్రాల్లో క్లోక్‌రూం సదుపాయం ఉండదు.

 ఓఎంఆర్‌ షీట్లపై అనవసర రాతలు, గుర్తులు, మతసంబంధ అంశాల్లాంటివి రాస్తే మాల్‌ప్రాక్టీస్‌గా పరిగణిస్తారు.

పరీక్షపత్రం బుక్‌లెట్‌లో ఇంగ్లిష్‌-తెలుగు, ఇంగ్లిష్‌-ఉర్దూ భాషలలో ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నల్లో ఏవైనా సందేహాలుంటే ఇంగ్లిష్‌ వెర్షన్‌నే పరిగణనలోకి తీసుకోవాలి.

కానిస్టేబుల్‌ ప్రాథమిక రాతపరీక్షలో కనీస అర్హత మార్కుల్ని ఈసారి కుదించారు. ఇప్పటివరకు జరిగిన పరీక్షల్లో ఎస్సీ/ఎస్టీలు 30శాతం.. బీసీలు 35శాతం.. ఇతరులు 40శాతం కనీస మార్కులు సాధిస్తేనే అర్హులుగా పరిగణించేవారు. ఈసారి సామాజికవర్గాలతో నిమిత్తం లేకుండా అందరికీ 30శాతం కనీస మార్కులనే అర్హతగా పరిగణించనున్నారు. ఈ పరీక్షలో ఆబ్జెక్టివ్‌ టైప్‌లో 200 ప్రశ్నలుంటాయి. వీటిలో 60 మార్కులు వస్తే సరిపోతుంది. నెగెటివ్‌ మార్కులు ఉంటాయి. అయిదు తప్పు సమాధానాలకు ఒక మార్కు తగ్గిస్తారు. ఇక్కడ అర్హత సాధిస్తే తదుపరి శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరు కావొచ్చు. ఇదీ గట్టెక్కితే తుది రాతపరీక్ష ఉండనుంది. ఆ పరీక్షలో మాత్రం నెగెటివ్‌ మార్కులుండవు.