జర జాగ్రత్త ..! అక్కడ 8000 మంది చిన్నారులకి కరోనా

corona effect on childrens

0
82

 

కరోనా మహమ్మారి ఎంత వేగంగా విస్తరిస్తోంది అనేది చూస్తునే ఉన్నాం. దారుణంగా కేసులు వస్తున్నాయి.. మొదటి వేవ్ కంటే రెండో వేవ్ ఎలాంటి దారుణాలు మిగిల్చిందో తెలిసిందే. యువకులు కూడా కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారు, కొందరు ఇంట్లో కోలుకుంటే మరికొందరు ఆస్పత్రుల పాలయ్యారు. అయితే కరోనా థర్డ్ వేవ్ కూడా ఉండవచ్చు అని జాగ్రత్తలు ఇప్పటి నుంచి తీసుకోవాలి అని నిపుణులు చెబుతున్నారు.

మరీ ముఖ్యంగా థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపిస్తుంది అని అంటున్నారు..ఈ థర్డ్ వేవ్ లో చిన్నారులకు ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు దీనిని ఎదుర్కొనేందుకు సిద్దం అవుతున్నాయి.

మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో 8 వేల మందికి పైగా చిన్నారులకు కోవిడ్ సోకింది… ఈ మే నెలలోనే ఇన్నికేసులు నమోదు కావడంతో అందరూ షాక్ అయ్యారు.. చిన్న పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్నారు. చిన్నపిల్లలని ఎక్కడకు తీసుకువెళ్లకండి అత్యవసరం అయితేనే బయటకు రావాలి అని కూడా వైద్యులు చెబుతున్నారు.