కరోనాను జయించిన ఈ భామ్మ వయస్సు ఎంతో తెలుసా…

కరోనాను జయించిన ఈ భామ్మ వయస్సు ఎంతో తెలుసా...

0
76

దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది… వైరస్ భారినపడ్డ కొందరు ఆందోళనకు గురై ఆత్మహత్యచేసుకుంటున్నారు… అలాంటి వారికి 102 సంవత్సరాల వృద్దురాలు ఆదర్శంగా నిలుస్తోంది…సరైన ఆహారం జాగ్రత్త లు తీసుకోవడం ద్వారా వైరస్ నుంచి కోలుకోవచ్చని నిరూపించింది…

అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం పెద్దకమ్మవారి పల్లెకు చెందిన సుబ్బమ్మ అనే మహిళ గత నెల కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది…వృద్దురాలితో పాటు ఆమె కుటుంబానికి సైతం కరోనా వైరస్ సోకింది… వైద్యులు బామ్మకు ఇంట్లోనే ఉండి మందులు వాడాలని సూచించారు..

వృద్దురాలి కొడుకుకు మధుమేహంతో బాధపడుతుండగా చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాడు.. బామ్మతో మరో ముగ్గురు కుటుంబసభ్యులు సైతం హోం ఐసోలేషన్ లో ఉండి కోలుకున్నారు…ఇప్పుడు బామ్మ మునుపటిలా చురుగ్గా ఉంది…