కరోనా రోగులకి ఈ వ్యాపారి చేస్తున్న సాయం తెలిస్తే శభాష్ అంటారు

కరోనా రోగులకి ఈ వ్యాపారి చేస్తున్న సాయం తెలిస్తే శభాష్ అంటారు

0
119

ఈ కరోనాతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అనేక కుటుంబాలు విషాదంలో ఉంటున్నాయి, ఇక ఉద్యోగాలు వ్యాపారాల నిమిత్తం బయటకువెళ్లిన వారుకూడా కరోనా బారినపడుతున్నారు..

ఆస్పత్రుల్లో బెడ్లే దొరకని పరిస్థితి. ఆక్సిజన్ అందుబాటులో లేదు. ఈ సమయంలో చాలా మంది ధనవంతులు వ్యాపారులు పేదలకు సాయం చేస్తున్నారు.

 

వారికి వీలైనంత సాయం అందిస్తున్నారు..యువ వ్యాపారవేత్త. ఢిల్లీలోని బోరీవలీకి చెందిన రాజీవ్ సింఘల్ తన సేవాగుణాన్ని చాటుకుంటూ.. ప్రతీరోజూ తన ఇంటిలో ఆహారాన్ని తయారుచేసి హోం క్వారంటైన్ లో ఉన్నవారికి అందిస్తున్నారు. సుమారు 2 పూటలా అన్నం అందిస్తున్నాడు .

 

ఏమేమి కావాలో అడిగి తెలుసుకుని మరీ వారి అవసరాల్ని తీరుస్తున్నారు రాజీవ్ సింఘాల్. అతను వారి పాలిట దేవుడు అయ్యాడు, అయితే అతను బట్టల వ్యాపారం చేసేవాడు, ఈ సమయంలో కరోనాతో బాధపడుతున్న వారి ఆకలి తీరుస్తున్నాడు..హోం క్వారంటైన్ లో ఉన్నవారి వివరాలు సేకరించి వారికి రోజుకు రెండు పూటలా కడుపు నిండా చక్కటి ఆహారాన్ని అందిస్తున్నారు.. ఆయన కూడా గతంలో కరోనా నుంచి కోలుకున్నారు. తనలా ఎవరూ బాధపడకూడదు అని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు