చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ఇండియాలో భార్య భర్తల మధ్య గొడవ పెడుతుంది… అవును మీరు వింటున్నది నిజమేనండి… ఈ సంఘటన కర్నూల్ జిల్లా ఆదోని మండలంలో జరిగింది… భర్త లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు…
ఇటీవలే ఇంటికి వచ్చాడు.. అయితే భార్య భర్తకు కండీషన్స్ పెట్టింది… కరోనా టెస్ట్ చేయుంచుకున్న తర్వాత ఇంట్లోకి రావాలి లేదంటే రానివ్వనని చెప్పింది… తెలంగాణలో కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందిన నేపథ్యంలో భార్య టెస్ట్ లు చేయించుకోమని భర్తకు చెప్పింది…
ఇంట్లో పిల్లలు ఉన్నారని అందుకే కరోనా టెస్ట్ లు చేయించుకోవాలని చెప్పింది.. అయితే భర్త ఒప్పుకోలేదు దీంతో వారిద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది.. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది… పోలీసులు వారిద్దరిని క్వారంటైన్ కు తరలించారు… ప్రస్తుతం ఈ సంఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది…
—