కరోనాతో ఇంటికి వెళ్లిన ప్రియుడికి పెళ్లి – ఎంట్రీ ఇచ్చిన ప్రియురాలు ఏం చేసిందంటే

కరోనాతో ఇంటికి వెళ్లిన ప్రియుడికి పెళ్లి - ఎంట్రీ ఇచ్చిన ప్రియురాలు ఏం చేసిందంటే

0
128

కొంత మంది అబ్బాయిలు అమ్మాయిలని మోసం చేస్తూ ఉంటారు … ప్రేమ పేరుతో వాడుకుని వారిని పక్కన పెడుతూ ఉంటారు, ఇక్కడ అలాంటిదే జరిగింది, బెంగళూరులో ఇద్దరు ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు, తర్వాత ఇద్దరూ ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలి అని భావించారు.. కాని ఈ సమయంలో అతనికి కరోనా సోకింది.. వెంటనే ఇంటికి వెళ్లాడు. ఓ ఇరవై రోజులు అక్కడే ఉన్నాడు ప్రియురాలితో మాట్లాడాడు.

అయితే ఈలోగా ఏమైందో తెలియదు కాని ఏకంగా అక్కడ ఓ అమ్మాయితో పెద్దలు పెళ్లి చేస్తే పెళ్లి చేసుకున్నాడు, దీంతో ఈ విషయం ముందు ప్రియురాలికి తెలియలేదు, కాని వివాహం అయిన తర్వాత రోజు ఆ అమ్మాయికి అబ్బాయి ఫ్రెండ్ ఎవరో ఫోటో పెట్టడంతో తెలిసింది .. వెంటనే ఆమె అతని ఇంటికి వెళ్లింది.

ఇలా నన్ను మోసం చేసి పెళ్లి ఎలా చేసుకున్నావు అని నిలదీసింది, అంతేకాదు అతనిపై కేసు కూడా పెట్టింది, చివరకు అక్కడ గ్రామంలో పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా అతనిని వదిలేసింది. ఇంత మోసగాడు అని తెలిసి ఆమె అతనితో కాపురం చేయను అంది, ఇక ప్రియురాలు కూడా నీలాంటి వాడు నాకు వద్దు అని అక్కడ నుంచి వచ్చేసింది, దీంతో ఇద్దరికి కాకుండా ఏకాకి అయ్యాడు ఈ ప్రియుడు.