ఈ కరోనా సమయంలో ముందు కుదుర్చుకున్న ముహూర్తానికి ఇటీవల పెళ్లిళ్లు చేసుకుంటున్నారు…అయితే అతి తక్కువ మంది సమక్షంలోనే పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. తాజాగా ఓ ఘటన మాత్రం అందరిని షాక్ కి గురిచేసింది.. భోపాల్ లోని సురేంద్ర యాదవ్ కు ఈ నెల 23 న పెళ్లి ముహుర్తం పెట్టుకున్నారు…యామిని దేవి పెళ్లికూతురు. అయితే గత నెలలో ఎంగేజ్ మెంట్ అయింది.. ఆ తర్వాత అతని మామ చనిపోవడంతో అశుభంగా ఫీల్ అయ్యారు.
అయితే ఇప్పుడు పెళ్లి రోజు పెళ్లికొడుకు తల్లికి తండ్రికి కరోనా సోకింది. ఇదంతా అశుభం అని ఆమెతో పెళ్లి వద్దు అని పెళ్లి కాన్సిల్ చేసుకున్నారు, అయితే పెళ్లికూతురు తరపు వారు వారిని ఎంతో బతిమలాడారు.. కాని వారిలో మార్పు రాలేదు.. మరో రెండు లక్షలు కట్నం ఇస్తే చేసుకుంటాం అన్నారు. దీంతో పెళ్లి కూతురు సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
దీంతో పెళ్లి కూతురు తండ్రి అప్పటికే ఇచ్చిన ఐదు లక్షల కట్నం, అలాగే తమకు పెళ్లి కి అయిన మరో రెండు లక్షల ఖర్చు, ఇక పెళ్లికొడుకు తీసుకున్న ఐదు తులాల బంగారం వెనక్కి ఇవ్వాలి అని ఆమె కండిషన్ పెట్టింది… లేకపోతే 24 గంటల్లో మీపై కేసు పెడతా అని ఫోన్ లో వార్నింగ్ ఇచ్చింది…. దీంతో ఈ కేసు ఎందుకు అని ఆ నగదు బంగారం అంతా తీసుకువచ్చి ఆమెకి ఇచ్చారు, ఈ పెళ్లి నేను చేసుకోను అని తెగేసి చెప్పింది ఆ దైర్యవంతురాలు.