కరోనా టీకా వేయించుకుంటే బీర్ ఫ్రీ ఎక్కడో తెలుసా

కరోనా టీకా వేయించుకుంటే బీర్ ఫ్రీ ఎక్కడో తెలుసా

0
90

దేశ వ్యాప్తంగా కరోనా టీకా వేసుకోవాలి అని ప్రభుత్వం చెప్పుతోంది.. కాని కొందరు ఈ కరోనాని అస్సలు లెక్కచేయడం లేదు.. దీంతో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో రోజుకి ఏకంగా 1. 20 వేలు కేసులు దాటుతున్నాయి అంటే పరిస్దితి అర్దం చేసుకోవచ్చు. టీకా వేసుకోవాలి అని ప్రజలను చైతన్య పరచడానికి వారిలో ఉన్న అపోహాలను తొలగించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఇప్పటికే కొన్ని సంస్ధలు పలు ఆఫర్లు ఇస్తున్నాయి టీకా వేయించుకున్నట్లు చూపిస్తే మీకు 500 రూపాయలు కొన్న సరుకులపై డిస్కౌంట్ అని ఓ స్టోర్ ఆఫర్ ఇచ్చింది…మరో చోట ప్లాస్కో, మరో చోట ముక్కుపుడక మరోచోట బంగారానికి గ్రాముకి 200 తగ్గింపు ఇలా ఆఫర్లు ఇస్తున్నారు.

ఓ రెస్టారెంట్ వినూత్న ఆఫర్ తో ముందుకొచ్చింది. హార్యానాలోని గుర్గావ్..గోల్డ్ రోడ్ లో ఇండియన్ గ్రిల్ రూమ్ రెస్టారెంట్ ఉంది.

వీరు మందుబాబులకి ఆఫర్ ఇచ్చారు..కరోనా టీకా వేయించుకొన్న వారికి బీర్ ఉచితంగా ఇస్తామని ప్రకటించింది.

ఇక మీరు వ్యాక్సిన్ వేయించుకున్నారు అనే ఫ్రూప్ చూపించాలి అప్పుడు మాత్రమే బీర్ ఇస్తారు, ఈ ఆఫర్ కేవలం వారం మాత్రమే అని తెలిపారు