కరోనా వైరస్ సోకిందని అపార్ట్ మెంట్ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి..

కరోనా వైరస్ సోకిందని అపార్ట్ మెంట్ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి..

0
129

కరోనా వైరస్ ఇప్పుడు అందరిని భయపెడుతుంది… ఎక్కడో చైనాలోని ఊహాన్ లో పుట్టిన ఈ మాయదారి మహమ్మారి అందరిని సమానంగా చూస్తోంది… అపార్ట్ మెంట్ లో లగ్జరీగా జీవిస్తున్న వారిని నెలమీద అడుక్కునే వారిని ఇద్దరిని సమానంగా చూస్తోంది… ఈ వైరస్ ఎలాంటి వ్యత్యాసం చూపకుంది…

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా నృత్యం చేస్తోంది… మన దేశం కూడా కరోనా కొరలకు చిక్కింది… దీంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది… తాజాగా హైదరాబాద్ లో ఉన్న ఒక వ్యక్తి తనకు కరోనా వైరస్ సోకిందనే ఉద్దేశంతో అపార్ట్ మెంట్ మీదనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు… రామంతపూర్ కు చెందిన కృష్ణ మూర్తి అనే 60 ఏళ్ల వ్యక్తికి ఎసిడెటి సమస్య ఉంది…

అందుకు సంబంధించిన మెడిసెన్ కూడా వాడుతున్నాడు… అయితే కొన్ని రోజులుగా పదే పదే ఆయాసం వస్తుంది… దీంతో తనకు కరోనా వైరస్ సోకిందనే ఉద్దేశంతో కింగ్ కోఠి ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు… కరోనా నెగిటివ్ అని వచ్చింది…

ఆతర్వాత గాంధీలో చికిత్స చేయించుకుంటానని కుటుంబ సభ్యులతో చెప్పాడు వారు ఆసుపత్రికి తీసుకువెళ్లుందుకు రెడీ అవుతున్న సమయంలో కృష్ణ మూర్తి బాల్కనిపైకి వెళ్లి కిందకు దూకి ఆత్మహ్య చేసుకున్నాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..