కపుల్ ఛాలెంజ్ లో మీ ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతున్నారా ? ఇది తప్పక చదవండి

కపుల్ ఛాలెంజ్ లో మీ ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతున్నారా ? ఇది తప్పక చదవండి

0
79

ఈ మధ్య సోషల్ మీడియాలో ఐస్ ఛాలెంజ్ రైస్ బకెట్ ఐస్ బకెట్ ఛాలెంజ్ వాకింగ్ ఛాలెంజ్ శారీ ఛాలెంజ్ అలాగే టెన్ ఇయర్స్ ఛాలెంజ్ ఇలా అనేకం వినిపించేవి… కొన్ని లక్షల ఫోటోలు వైరల్ అయ్యేవి, అయితే ఇప్పుడు మళ్లీ చాలా మంది కపుల్ ఛాలెంజ్ అంటూ మొదలుపెట్టారు.

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తోంది, అయితే ఇలా ఛాలెంజ్ స్వీకరించే వారు ఫోటోలు పెట్టే సమయంలో కాస్త ఆగాలి అని చెబుతున్నారు టెక్ నిపుణులు, సేఫ్టీ లేని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించాలని సూచిస్తున్నారు.

మీరు మీ భార్యలతో ఫోటోలు దిగి పోస్ట్ చేస్తున్నారు, అక్కడ లైకులు కామెంట్లు వస్తున్నాయి.. తర్వాత ఆ ఫోటోలు వేరే వారి దగ్గరకు వెళుతున్నాయి, అక్కడ నుంచి పలు అశ్లీల వెబ్ సైట్లలో మార్ఫింగ్ ఫోటోలుగా మారుతున్నాయి, తర్వాత ఇవి చూసి పోలీసుల దగ్గరకు వచ్చి కేసు పెడుతున్నారు, అందుకే ఇలాంటివి పోస్ట్ చేసే ముందు కాస్త ఆలోచించాలి అంటున్నారు టెక్ నిపుణులు పోలీసులు.

ఫేస్బుక్, ఇన్స్టాలో ఇప్పుడు కపుల్ ఛాలెంజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ ఫోటోలను మిస్యూజ్ చేసే ప్రమాదం ఉండటంతో ఛాలెంజ్లతో తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు పోలీసులు. సో బీకేర్ ఫుల్.