మొసలి బలం నీటిలో ఉంటే ఎలా ఉంటుందో తెలిసిందే. ఇక బయటకు వచ్చినా దాని దవడల శక్తితో విరుచుకుపడుతుంది. అందుకే దాని జోలికి ఎవరూ వెళ్లరు. ఇక చిన్న జీవి కనిపించింది అంటే మొసలి రెచ్చిపోతుంది. దానిని వెంటాడి మరీ ఈ బద్దక జీవి చంపేస్తుంది.
పులి అయినా, సింహాం అయినా, ఏనుగైనా దీని దవడల బలానికి బలవ్వాల్సిందే. అయితే ఇంత పెద్ద పేరుగల మొసలి చిన్న జంతువు చేతిలో మోసపోయింది. ఆశ్చర్యంగా ఉందా ? ఏమిటా చిన్నజంతువు అనుకుంటున్నారా? ఆ చిన్న జంతువే తాబేలు. మరి ఈ చిన్న జీవి ఎలా తప్పించుకుందనేది తెలుసుకుందాం.
ఈ మొసలి తాబేలుని మింగడానికి ప్రయత్నిస్తోంది. కానీ తాబేలు తన ప్రాణాల కోసం పోరాడింది.ఎలాగైనా దవడలతో దీనిని చంపేద్దాం అనుకుంది కానీ, తాబేలు దాని కవచంతో మొసలిని బురిడి కొట్టించింది.దాని తెలివితో తాబేలు బయటపడింది. నిజంగా దీనికి భూమిమీద నూకలు ఉన్నాయనే చెప్పాలి.
ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
లింక్.
https://twitter.com/AfricanimaIs/status/1400366179340800004
— African animals (@AfricanimaIs) June 3, 2021