లాక్ డౌన్ సమయంలో చాలా వరకూ దుకాణాలు తెరచుకోవడం లేదు… అయితే తెరచిని దుకాణాలకు కూడా కొంత సమయం మాత్రమే ఇచ్చారు, ఈ సమయంలోనే దుకాణాలు తెరుస్తారు, అయితే తమిళనాడులోని తూతుకూడి జిల్లా శతాంకులంలో ఓ దారుణం జరిగింది.
లాక్ డౌన్ సమయంలో 15 నిమిషాలు అదనంగా మొబైల్ షాప్ ను తెరిచారని తండ్రీకొడుకులను పోలీసులు హింసించడం జరిగింది. ఇక్కడ ఫెనిక్స్ చిన్న మొబైల్ షాపు నడుపుతుంటాడు. జూన్ 19వ తేదీ సాయంత్రం 8.15 వరకు షాపు తెరిచే ఉంచడంతో పెట్రోలింగ్ పోలీసు ఫెనిక్స్‌ను బయటకు లాగాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
తర్వాత రోజు పోలీసులు అక్కడకు వచ్చి అతని తండ్రి జయరాజ్‌తో గొడవపడి అతడిని స్టేషన్‌కి తీసుకెళ్లారు., అతనిపై కేసులు పెట్టారు, ఈ సమయంలో కొడుకుకు విషయం తెలిసి స్టేషన్ కు వెళ్లాడు,
అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసు కస్టడీలో జయరాజ్, ఫెనిక్స్‌లను పోలీసులు తీవ్రంగా హింసించారు. చివరకు వారిద్దరిని ఆస్పత్రికి తీసుకువెళితే ఇద్దరూ మరణించారు. దీనిని దేశ వ్యాప్తంగా అందరూ కూడా దారుణంగా ఖండించారు, ఈ దారుణానికి కారణమైన ఖాకీలపై చర్యలు తీసుకుంటోంది అక్కడ ప్రభుత్వం.