ధన త్రయోదశి రోజు ఇలా చేస్తే మీకు అష్ట ఐశ్వర్యాలు సిద్దిస్తాయి

ధన త్రయోదశి రోజు ఇలా చేస్తే మీకు అష్ట ఐశ్వర్యాలు సిద్దిస్తాయి

0
81

అసలు ఈ ధన త్రయోదశి అంటే ఏమిటి చూద్దాం..ఆశ్వీయుజ మాసం కృష్ణ పక్షమిలో వచ్చే త్రయోదశిని ధన త్రయోదశి అని అంటారు … యమధర్మరాజుకు ప్రీతికరమైన రోజు.ఈ రోజు ఆయనను పూజించడం వలన మనకు ఎంతో మంచిది అని పురాణాలు చెబుతున్నాయి, మనకు ఉన్న దోషాలు పోయి నరకలోకానికి కాకుండా స్వర్గానికి చేరుకుంటాము అని తెలియచేస్తున్నాయి.

ఇక మన ఇంట్లో ఉన్న ఆభరణాలు బంగారు ఆభరణాలు వెండి వస్తువులు నిష్టగా స్నానం చేసి పసుపు నీటిలో కడిగి పొడి వస్త్త్రంతో తుడిచి అప్పుడు అమ్మవారి విగ్రహాలకి ఆభరణాలకి కుంకుమ బొట్లు పెట్టి దేవుడి గదిలో పూజ చేయాలి.

అంతేకాదు ఈరోజు చాలా మంది కొత్త బంగారం కొనుగోలు చేసి పూజ చేసుకోవాలి అని అంటారు, అదేమీ కాదు మీ దగ్గర ఉన్న పాత బంగారు ఆభరణాలు వెండి వస్తువులని అయినా మీరు పసుపు నీటితో కడిగి లక్ష్మీదేవి పటం దగ్గర పెట్టి అమ్మవారిని కొలిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్దిస్తాయి.