దారుణం… 18 విద్యార్థులపై టీచర్ లైంగిక వేధింపులు

దారుణం... 18 విద్యార్థులపై టీచర్ లైంగిక వేధింపులు

0
94

మన దేశంలో గురువును దైవంతో పోల్చుతారు… తన విద్యార్థిని తీర్చి దిద్ది ఉన్నత స్థాయిలో ఉంచే వ్యక్తి గురువు… కనిపించే ప్రత్యక్ష దైవంతో పోల్చుతారు గురువును… అలాంటి గురువు తనలో ఉన్న వక్రబుద్దిని బయటపెట్టి ఇప్పుడు కటకటాపాలు అయ్యాడు…

ఈ ఘటన ముంబైలో జరిగింది పేరు గోప్యంగా ఉంచడం జరిగింది ఓ మున్సిపల్ స్కూల్ లో ల్యాబ్ టీచర్ గా పనిచేస్తున్న వ్యక్తి ఆరు ఏడు ఎనిమిది తరగతి చదువుతున్న విద్యార్థులను లైంగికంగా వేధించేవాడు… పాఠశాల సెలవుల్లో కూడా కంప్యూటర్ క్లాస్ లు ఉన్నాయని చెప్పి వారిని ల్యాబ్ కు పిలిపించుకుని లైంగిక దాడి చేసేవాడు… ఇక ఈ విషయాన్న ప్యూన్ గుర్తించి యాజమాన్యానికి చెప్పారు…

ఇటీవలే కంప్యూటర్ క్లాస్ ఉందని చెప్పడంతో విద్యార్థులు ల్యాబ్ కు వెళ్లేందుకు నిరాకరించారు దీంతో మహిళా టీచర్స్ ఫ్రెండ్లీగా మాట్లాడి ఏం జరిగిందని తెలుసుకున్నారు.. దీంతో మొత్తం విషయం బయట పెట్టారు విద్యార్థులు… ల్యాబ్ టీచర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు… అతని పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు…v