దారుణం కేరళలో మరో ఏనుగు మృతి…

దారుణం కేరళలో మరో ఏనుగు మృతి...

0
101

కేరళలోని సైలెంట్ వ్యాలీలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పైనాపిల్ లో పేలుడు పదార్థాల ఉంచి ఆకలితో ఉన్న ఏనుగుకు ఇవ్వగా దాన్ని తినడంతో ఏనుగు తీవ్రంగా గాయపడింది… తరువాత ఆకలితోనే ఆనదిలో మరణించింది… ఈ వార్త ప్రపంచమంతా వైరల్ అయిన సంగతి తెలిసిందే… ప్రతీ ఒక్కరు దీనిపై స్పందిస్తున్నతరుణంలో మరో ఏనుగు ఉదంతం బయటకు వచ్చింది…

ఏప్రిల్ నెలలో ఓ ఏనుగు కేరళ రాష్ట్రంలో బలహీనంగా కనిపించింది.. నడవలేకపోతున్న దానికి అటవీ శాఖ అధికారులు వైద్యం అందించేందుకు ట్రై చేశారు.. కానీ ఆ ఏనుగు సహక రించలేదు.. అక్కడ నుంచి వెళ్లి పోయింది.. కొంత దూరం వెళ్లి అక్కడ పడిపోయింది…

ఆకలితో ఆ ఏనుగు మరణించింది పోస్టు మార్టం ప్రాథమిక రిపోర్ట్ లో ఏనుగు దవడ విరిగిపోయినట్లుగా తెలిసింది… ఈ ఏనుగు కూడా పేలుడు పదార్థం తినడంవల్లనే మరణించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు… ఏనుగుల మరణాలకు కారణం అయిన వారిపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు అధికారులు…