దారుణం లాక్ డౌన్ వేళ యువతిపై గ్యాంగ్ రేప్…

దారుణం లాక్ డౌన్ వేళ యువతిపై గ్యాంగ్ రేప్...

0
99

కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది… దీంతో ఎవరి ఇళ్లకు వారు పరిమితం అయ్యారు… బతికుంటే బలుసాకు అయినా తినచ్చు అని ప్రతీ ఒక్కరు లాక్ డౌన్ పాటిస్తున్నారు… దీంతో దేశ వ్యాప్తంగా నేరాల రేటు తగ్గాయని భావిస్తున్న తరుణంలో మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది…

19 ఏళ్ల యువతి తన సోదరుడితో కలిసి బైక్ పై పెట్రోల్ బంకుకు వెళ్లింది అక్కడ నుంచి రోడ్డు మార్గంలో వస్తుండగా బైక్ హెడ్ లైట్ పాడైంది దీంతో రోడ్డు మార్గంలో బండి ఆపి రిపేర్ చేస్తున్నాడు… ఆ సమయంలో అటునుంచి ముగ్గురు వ్యక్తులు రెండు బైక్ లలో వచ్చి యువకుడిపై దాడి చేసి బావిలోకి తోసేశారు…

ఆ తర్వాత యువతిని నిర్మానుస్య ప్రదేశానికి తీసుకువెళ్లారు… అప్పటికే అక్కడ ఉన్న మరో నలుగురు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు… యువతి సోదరుడుఎలాగోలా బావినుంచి బయటకు వచ్చి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు.. దీంతో వారు సంఘటన స్థాలానికి చేరుకుని యువతి కోసం గాలించారు..

అపస్మారక స్థితిలో ఉన్న యువతి కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు… దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.. అందులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.. ఈ ముగ్గురుని బాధితురాలు గుర్తుపట్టింది… పరారిలో ఉన్న వారికోసం పోలీసులు గాలిస్తున్నారు…