దారుణం లాక్ డౌన్ సమయంలో ఈ జిల్లాలో మృగాల్లా మారుతున్న మనుషులు…

దారుణం లాక్ డౌన్ సమయంలో ఈ జిల్లాలో మృగాల్లా మారుతున్న మనుషులు...

0
134

కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కేంద్రం మే 17 వరకు లాక్ డౌన్ పొడిగించింది… దీంతో ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది… తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక యువకుడు బెంగుళూరులో కోచింగ్ తీసుకుంటున్నాడు… మార్చి నెలల కేంద్ర కర్య్ఫూ విధించడంతో ఆ యువకుడు ఎలాగోలా నెల్లూరు జిల్లాకు చేరున్నాడు ఇటీవలే అక్కడ నుంచి ఇంటికి వెళ్లే పరిస్థితి కనపడలేదు దీంతో ఆ యువకుడు ఎలాగైనా తన గ్రామానికి చేరుకోవాలి చూశాడు…

రోడ్డుపై వస్తున్నఏదో ఒక వ్యాన్లో ప్రకాశం వరకు చేరుకున్నాడు ఆతర్వాత వేరే వారిని లిఫ్ట్ అడిగి గుంటూరు ప్రకాశం టోల్ ప్లజా వరకు వచ్చాడు అక్కడనుంచి ఒంగోలుకు చేరుకుని హైవేపై లిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్నాడు… ఇంతలో పల్సర్ బైక్ పై ముగ్గురు వచ్చి అతన్ని చితక్కొట్టి బంగారం డబ్బులు తీసుకుని వెళ్లారు…

ఇక ఆ యువకుడు ఎలాగోలా పోలీస్ స్టేషన్ కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు… కేసునమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు… ఇలాంటి సమయంలో చేతనైతే సహాయం చేయాలి లేదంటే వెళ్లి పోవాలి ఇలా రాక్షసంగా ప్రవర్తించడం ఏంటని భావిస్తున్నారు..