దారుణం… మొన్న కేరళలో ఎనుగు నోట్లు బాంబు… నేడు ఏపీలో ఆవు నోట్లు బాంబు…

దారుణం... మొన్న కేరళలో ఎనుగు నోట్లు బాంబు... నేడు ఏపీలో ఆవు నోట్లు బాంబు...

0
117

కొంత మంది పైశాచికత్వం కోసం మూగ జీవులను బలితీసుకుంటున్నారు… ఇటీవలే కేరళలో గర్భణీగా ఉన్న ఏనుగుకు పైనాపిల్ లో పేలుడు పదార్థాలు కలిపి ఇచ్చారు దీంతో ఆ ఏనుగు మృతి చెందిన సంగతి తెలిసిందే… ఈ వార్త దేశ వ్యాప్తంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే…

ఇక ఈ వార్త మరువక ముందే తెలంగాణలో మరో దారుణం జరిగింది… ఇటీవలే నీళ్లు తాగేందుకు వచ్చిన ఒక కోతిని ఉరి వేసి చంపిపాడు ఖమ్మం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి… తాజాగా ఏపీలో కూడా దారుణం జరిగింది… మేత కోసం వెళ్లిన ఆవుకు నాటు బాంబుతో పెట్టిన పండును ఇచ్చారు వేటగాళ్లు…

దీంతో ఆ పండును ఆవు కొరికడంతో మత్తు పదార్థం పేలింది… ఈ ప్రమాదంలో ఆవు నోటి భాగం చిత్రమైంది… ఇక విషయం తెలుసుకున్న స్థానికులు పశువైద్యుడికి సమాచారం అందించారు… వారు వెంటనే వచ్చి ఆవుకు చికిత్స అందించారు.. ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు… మేత కోసం వెళ్లిన చోట నాటు బాంబులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..