దారుణం నిండు గర్భణీ శవాన్ని చెట్టుకు కట్టేసి…..

దారుణం నిండు గర్భణీ శవాన్ని చెట్టుకు కట్టేసి.....

0
117

నేటి కంప్యూటర్ యుగంలో ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో మూఢనమ్మకాలని పాటిస్తున్నారు… ఇలా మూఢనమ్మకాలను పాటిస్తూ దహన సంస్కారాలు చేయకుండా ఒక నిండు గర్భణి శవాన్ని అడవిలో చెట్టుకు కట్టేసి వదిలి వెళ్లారు… ఈ దారుణమైన సంఘటన కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరంలో జరిగింది…

ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది… ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… రుద్రవరం మండలంలోని తెలుగు గంగా 19 బ్లాక్ కాలువ సమీపంలోని నాగిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన 20 సంవత్సరాల ఓ మహిళ నిండు గర్భణీగా ప్రసవ సమయంలో ఆమెకు వైద్యం అందక ఇటీవలే మృతి చెందింది…

అయితే మృత దేహానికి దహన సంస్కారాలు చేయకుండా అలాగే చెట్టుకు కట్టేసి వదిలేసి సంప్రదాయము కట్టుబాట్లు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నాయి… ఈ క్రమంలో మహిళ శవాన్ని చెట్టుకు కట్టి వదిలేసి వచ్చారు…