దారుణం ఒక యువతికి బలవంతంగా తాళి కట్టి అత్యాచారం…

దారుణం ఒక యువతికి బలవంతంగా తాళి కట్టి అత్యాచారం...

0
102

ఏపీలో దారుణం జరిగింది.. ఇంటర్ చదువుతున్న ఒక యువతికి ఒక యువకుడు బలవంతంగా తాళి కట్టి లైంగిక దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 15 సంవత్సరాల మైనర్ బాలిక తన అమ్మమ్మ ఇంటిదగ్గర ఉంటుంది… అమ్మమ్మ ఇంట్లో ఉంటూ ఇంటర్ చదువుతోంది…

బాలిక రోజు కాలేజీకి వెళ్లి వచ్చే క్రమంలో స్థానికంగా పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న ఒక యువకుడు ఆమెకు మాయ మాటలు చెప్పి పరిచయం పెంచుకున్నాడు కొన్ని రోజులకు తాను ప్రేమిస్తున్నట్లు చెప్పాడు అయితే ఆమె యువకుడి ప్రేమను అంగీకరించలేదు… దీంతో కోపం పెంచుకున్న యువకుడు… బలవంతంగా బాలికను ఇంటికి తీసుకువెళ్లి తాళి కట్టాడు..

ఆ తర్వాత శోభనం పేరుతో లైంగికదాడి చేశాడు… ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని చెప్పాడు… ఇక చాలా రోజుల నుంచి బాలిక మానసికంగా కుంగిపోతున్న విషయాన్ని అమ్మమ్మ గుర్తించి గట్టిగా అడిగింది దీంతో అసలు విషయం చెప్పింది… వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది… అమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు…