దారుణం…. తమ్ముడి తలను తెగనరికిన అన్న….

దారుణం.... తమ్ముడి తలను తెగనరికిన అన్న....

0
91

ఆస్తికోసం తోడబుట్టిన తమ్ముడి తలను తెగనరికిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది… ఈ సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది… పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పుట్టూరు మండలం శనగల గూడూరుకు చెందిన రామాంజినేయులు … రాజకుల్లాయప్ప అన్నదమ్ములు వీరిద్దరి మధ్య కొద్దిరోజులు ఆస్తితగాదాలు జరుగుతున్నాయి…

ఈ వివాదం కాస్త చిలికి చిలికి చివరకు హత్యదాక దారి తీసింది… ఆస్తి విషయంలో తమ్ముడు కుల్లాయప్ప అడ్డువస్తున్నాడనే ఉద్దేశంతో అన్న రామాంజినేయులు అత్యంత పాశవికంగా నరికి చంపాడు…

తల మొండెంను వేరు చేసి అతికిరాతకంగా నరికి చంపాడు… ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతుంది… ప్రస్తుతం రామాంజినేయులు పరారిలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు…