దారుణం టిఫిన్ బాక్స్ లో తల ఇంటిలో మొండెం..

దారుణం టిఫిన్ బాక్స్ లో తల ఇంటిలో మొండెం..

0
103

ఒక వ్యక్తి దారుణ హత్యకు గురి అయ్యాడు… ఊరి శివారులోని చెరువు ఘాట్ సమీపంలోని లోయలో టీఫిన్ బాక్సులో తలను పడేశారు… మొండెంను మరో చోట పడింది… ఈ దారుణమైన సంఘటన కడప జిల్లా ఎర్రగుంట్లో జరిగింది… అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

ఎర్రగుంట్ల పట్టణంలోని మాజీ ఐసీఎల్ ఉద్యోగి వెంకటరమణను అతి దారుణంగా నరికి చంపారు… మాజీ మున్సిపల్ చైర్మన్ ముసలయ్య ఇంటి ఆవరణలో నీటి తొట్టెలో వెంకటరమణ మెండెంను మట్టితో పూడ్చారు…. అలాగే తని తలను టిఫిన్ బాక్స్ లో పెట్టి గువ్వల చెరువు ఘాట్ లో పడవేసినట్లు తెలుస్తోంది…

ఇక విషయం తెలుసుకున్న కడప డీఎస్పీ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.,.. ఈ కేసులో ముసలయ్య హస్తం ఉన్నట్లు తెలుస్తోంది… ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు… ఆర్థిక లావాదేవిలే ఈ హత్యకు కారణం అని పోలీసులు భావిస్తున్నారు…