దారుణం… యువతికి ఇంజెక్షన్లు ఇచ్చి డాక్టర్ లైంగిక దాడి….

దారుణం... యువతికి ఇంజెక్షన్లు ఇచ్చి డాక్టర్ లైంగిక దాడి....

0
139

అనారోగ్యంతో ఉన్న వారిని వైద్యం అందించాల్సిన డాక్టర్ కీచకుడిగా మారాడు… చికిత్స కోసం వచ్చిన ఒక యువతిపై డాక్టర్ లైంగిక దాడికి ప్రయత్నించి అడ్డంగా బుక్ అయ్యాడు… ఈ దారుణమైన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగింది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… పంతాల సత్యనాంద్ అనే వ్యక్తి స్థానికంగా క్లీనిక్ పెట్టుకున్నాడు…

ఈ క్రమంలో ఒక మహిళ అనారోగ్యంతో తన తల్లి సహాయంతో ఆసుపత్రికి వచ్చింది… అప్పుడు డాక్టర్ నాలుగు మాత్రలు ఇచ్చి ఇంజెక్షన్ వేసి పంపించాడు… మరుసటి రోజు ఆమెకు ఫోన్ చేసి రమ్మన్నాడు… తనకు వేరే చోట పని ఉందని ఇంజెక్షన్లు వేసి వెళ్తానని చెప్పాడు… దీంతో ఆ యువతి తన సోదరుడిని తీసుకుని క్లీనిక్ కు వచ్చింది…

ఆమెకు ఏవేవో ఇంజక్షన్లు వేశాడు దీంతో మైకానికి గురి అవుతున్న ఆమెకు దుస్తులు తొలగిస్తూ అత్యాచారం చేయబోయాడు… ఈ క్రమంలో తేరుకున్న యువతి అతని నుంచి తప్పించుకుని గట్టిగా కేకలు వేసింది… ఆతర్వాత తల్లిదండ్రులకు విషయం చెప్పింది… వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు… వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చుసుకుని డాక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు… అతన్ని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు..