దారుణం యువతిపై రెండు నెలలుగా గ్యాంగ్ రేప్…

దారుణం యువతిపై రెండు నెలలుగా గ్యాంగ్ రేప్...

0
96

ఒక అమాయకపు యువతి వీక్ నేస్ ను అవకాశంగా మార్చుకుని సుమారు రెండు నెలలుగా గ్యాంగ్ రేప్ చేస్తూన్నారు.. ఈ దారుణం ఒడిశా రాష్ట్రంలో జరిగింది… మారుమూల పల్లెటూరి అమ్మాయికి సిటీలో ఉద్యోగం చేయాలని ఆశ ఉండేది తన మేనత్త ద్వారా భువనేశ్వర్ కు చేరుకుంది.. అక్కడ మేనత్త ఒక వ్యక్తిని పరిచయం చేసింది… ఇంటర్వ్యూ హోటల్ లో ఉంటుందని తీసుకువెళ్లాడు…

హోటల్ లో ఇంటర్వ్యూ రెండు రోజులు ఉందని బాగా ప్రిపేర్ అవ్వు అని ఆ వ్యక్తి చెప్పాడు కొద్ది సేపటి తర్వాత ఆ గదిలోకి అతనితో పాటు మరికొందరు వ్యక్తులు వచ్చారు.. వారు కూడా ఇంటర్వ్యూ చేస్తారని చెప్పారు… ఆ తర్వాత డోర్ కు గడి పెట్టి ఆమెను గ్యాంగ్ రేప్ చేశారు.. తప్పించుకోలేక నిస్సహాయ స్థితిలో అక్కడే ఉండిపోయింది ఆ యువతి…

అదే సమయంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్… దీంతో ఆ యువతి హోటల్ లోనే ఉండాల్సి వచ్చింది… ఈ క్రమంలో ఆ వ్యక్తి మళ్లీ వచ్చి జరిగిందేదో జరిగిపోయింది… ఇక్కడే కొన్నాళ్లు ఉండు అని చెప్పాడు… అలా రెండు నెలలుగా అత్యాచారం చేస్తూ వచ్చారు…

ఈ క్రమంలో తన మేనత్త హోటల్ కు రావడంతో ఆమెను నిలదీసింది… దీంతో ఆమె ఆ యువతిని కిటికీ లోనుంచి తోసేసింది… తీవ్ర గాయాలతో ఉన్న ఆ యువతిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు… ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పేరెంట్స్ సమాచారం అందించింది… ప్రస్తుతం ఈ సంఘటన ఒడిశాలో సంచలన రేపుతోంది… పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…