కూతురు ఫ్రెండ్ అని ఇంట్లోకి రానిచ్చారు చివరకు పెద్ద స్కెచ్ వేసింది

కూతురు ఫ్రెండ్ అని ఇంట్లోకి రానిచ్చారు చివరకు పెద్ద స్కెచ్ వేసింది

0
103

కొందరు స్నేహితులని చాలా బాగా నమ్ముతారు, ఇంటివారి కంటే వారిపైనే నమ్మకం పెట్టుకుంటారు, కొందరు అదే విశ్వాసం నమ్మకం చూపిస్తే మరికొందరు మాత్రం వారి నమ్మకాన్ని ఒమ్ము చేస్తారు.స్నేహితురాలి ఇంటి నుంచి రెండు విడతల్లో రూ. 57 లక్షలు కాజేసింది ఓ మహిళ.. ఈ సంఘటన ఇప్పుడు అందరిని షాక్ కి గురి చేసింది ఢిల్లీలో.

పుష్ప అనే మహిళ తన ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురి స్నేహితురాలైన పూజపై అనుమానం వ్యక్తం చేసింది. అయితే వారు ఇళ్లు అమ్మగా వచ్చిన నగదుని ఇంట్లో పెట్టుకున్నారు, దీనిని పూజ చూసింది.

అందులోంచి రూ. 27 లక్షలు దొంగిలించి తన తమ్ముళ్లకు ఇచ్చింది. వారి చేత ఫ్లాట్ కొనిపించింది. మరోసారి పుష్ప ఇంటికి వెళ్లి మళ్లీ రూ. 30 లక్షలు కాజేసింది. దీంతో పోలీసులు తమ స్టైల్లో విచారణ చేస్తే చేసిన తప్పు ఒప్పుకుంది, ఆమె సోదరులని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు…25 లక్షల విలువైన ఓ ఫ్లాట్, నగలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇలాంటి వారితో జాగ్రత్త అంటున్నారు.