ప్రపంచం అంతా ఈ కరోనా వైరస్ గురించి భయపడుతోంది, ఇక పెళ్లి ఫంక్షన్లు ఇలా అన్నింటిని వాయిదా వేసుకుంటున్నారు… ముందుగా ముహూర్తాలు పెట్టుకున్నా అవి రద్దు చేసుకుంటున్నారు.
ఈనెల 31 వరకూ లాక్ డౌన్ ప్రకటించాయి తెలుగు రాష్ట్రాలు.. ఇక ఎవరూ బయటకు తిరగకండి అని చెబుతున్నారు. రోడ్లపై పలు ఆంక్షలు విధిస్తున్నారు.
తాజాగా కేరళలో ఈ వైరస్ కేసులు మరింత ఎక్కువగా వ్యాపిస్తున్నాయి, ఈ సమయంలో వివాహాలు కూడా చాలా మంది వాయిదా వేసుకుంటున్నారు….గుడి కూడా అన్నీ క్లోజ్ చేయడంతో ఇళ్లల్లో పెళ్లి చేసుకుంటున్నారు, కేవలం రెండు కుటుంబాలు అలాగే కేవలం 50 మందితో వివాహాలు జరుగుతున్నాయి.
తాజాగా కేరళలో ఓ వ్యక్తి అంగరంగ వైభవంగా తన కూతురు వివాహం జరిపించారు, 1000 మంది అతిధులని పిలిచి గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు, దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అక్కడ జరిపే వివాహానికి 60 మందికి మించి అతిథులను ఆహ్వానించొద్దని తహసీల్దార్ పోలీసులు ఆదేశించినా ఆ యజమాని పట్టించుకోలేదు. తన బంధువులతో పాటు నగరంలోని స్నేహితులు, పరిచయస్తులందరినీ ఆహ్వానించి ఘనంగా కూతురి పెళ్లి జరిపించాడు. దీంతో అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు.