శేషాద్రి స్వామి మరణం తీరని లోటు: టీటీడీ చైర్మన్

0
89

తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న కార్తిక దీపోత్సవంలో పాల్గొనడానికి విశాఖ వెళ్లిన శేషాద్రి..వేకువజామున 4 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. అతని మృతి పట్ల టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.

తిరుమల శ్రీవారి సేవలో 1978 నుంచి తరిస్తున్న శ్రీ పాల శేషాద్రి (డాలర్ శేషాద్రి) స్వామి మరణం టీటీడీకి తీరని లోటు. వైజాగ్ లో ఈ రోజు టీటీడీ నిర్వహించనున్న కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి శేషాద్రి స్వామి వెళ్ళారు.

శ్రీవారి సేవే ఊపిరిగా ఆయన పని చేశారు. ఆయన జీవితమంతా స్వామివారి సేవలో తరించిన ధన్య జీవి. అందరితో ప్రేమగా, ఆలయ కార్యక్రమాల్లో అధికారులు, అర్చకులకు పెద్ద దిక్కుగా పని చేశారు. ఆయన మరణ వార్త నన్ను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని శ్రీవారిని ప్రార్థిస్తున్నాను.