వినాయక చవితికి మండపాన్ని ఇలా అలంకరించండి..

0
100

హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో వినాయకచవితి కూడా ఒకటనే విషయం తెలిసిందే. వినాయక చవితి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. ఇంకొన్ని రోజుల్లో గ్రామాల్లో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. దాంతో ప్రజలు వాడ వాడల గణేషుడి మండపాలు ఏర్పాటు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. వినాయక చవితికి మండపాన్ని ఇలా అలంకరిస్తే అందరు వావ్ అనాల్సిందే..

మనకి షాపుల్లో కలర్ పేపర్స్ దొరుకుతాయి. వాటిని కొని చక్కగా అలంకరణ చేస్తే మండపం అద్భుతంగా కనిపిస్తుంది. రంగు కాగితాలతో దండలు, పువ్వులు, వాల్ హ్యాంగింగ్స్ లాంటివి చేసి పెట్టడం వల్ల మండపానికి మరింత అందం వస్తుంది. లేదంటే, సీతాకోకచిలకలు గొడుగులు వంటివి కూడా మీరు ఆ కలర్ పేపర్స్ తో తయారు చేసి అతికిస్తే ఎంతో అందంగా ఉంటుంది.

ఇలా అలంకరణ చూస్తే ఎవరైనా ఫిదా అయిపోతారు. నూనె దీపాలను కానీ ఎలక్ట్రికల్ బల్బులు కానీ మీరు అలంకరణకు వాడడం వల్ల  ఆకర్షణీయంగా కనబడుతాయి. బ్యాక్ గ్రౌండ్ వాల్ సహాయంతో  డెకరేట్ చేయడం వల్ల మండపానికి ఎంతో అందం వస్తుంది.