సమాజంలో అమ్మాయిలపై దాడులు ఇంకా ఆగడం లేదు.. ప్రమాదం జరిగిన తర్వాత నిష్టూరం మినహ ప్రభుత్వాలు ఏమీ చేయలేవా అనే ప్రశ్న యువత నుంచి వస్తోంది. కఠిన చట్టాలు తెచ్చినా కొందరు మానవ మ్రుగాలు బరి తెగిస్తున్నాయి .నరరూప రాక్షసుల్లా మారిపోతున్నారు, ఇలాంటి వారికి కళ్లెం వేసే దిశగా ప్రభుత్వాలు చట్టాలు చేయాలి అని సమాజం కోరుతోంది.
తాజాగా బెంగుళూరు మెట్రో రైలు తన నిబంధనల్లో మార్పులు చేసింది.దీని గురించి దేశంలో అందరూ చెప్పుకుంటున్నారు, అంతేకాదు మిగిలిన కాస్మోపాలిటిన్ నగరాలు కూడా దీనిని ఆదర్శంగా తీసుకుని ఈ రూల్ పాస్ చేయాలి అని కోరుతున్నారు. మహిళల రక్షణ కోసం ఇక నుంచి పెప్పర్ స్ప్రేలను కూడా లోపలికి అనుమతి ఇస్తామని ప్రకటించింది బెంగళూరు మెట్రో. దీనిపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా తమపై దాడులు చేయాలి అన్నా ఎవరైనా ఈవ్ టీజింగ్ కు పాల్పడినా వారిపై పెప్సర్ స్రే వాడతాం అంటున్నారు అమ్మాయిలు. ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ దిశ ఘటన తర్వాత తమ హ్యాండ్ బాగ్ లో పెప్నర్ స్పే పెట్టుకున్నాం అని చెబుతున్నారు. ఇక ఇలాంటి దుర్మార్గులకు అక్కడికక్కడే సమాధనం చెప్పేలా అమ్మాయిలు సిద్దం అవుతున్నారు. ఇది మహిళలకు ఆయుధం లాంటిది అంటున్నారు నెటిజన్లు.