దిశ ఘటనకు ముందు రోజు మరో దారుణం, నమ్మలేని నిజం

దిశ ఘటనకు ముందు రోజు మరో దారుణం, నమ్మలేని నిజం

0
95

నవంబర్ 27 వ తేదీన దిష ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, దిశ ఘటన జరగడానికి ముందు రోజు నగరంలోనే మరో దారుణమైన ఘటన జరిగింది. ఇదే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మరో చర్చకు కారణం అయింది. నిత్యం అమ్మాయిలపై దాడులకు పాల్పడుతున్న ఈనరరూప రాక్షసులని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు జనం.
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ ఉదంతానికి ఒక్కరోజు ముందు హైదరాబాద్ మహానగరంలో అసలు ఏం జరిగిందంటే

పాతబస్తీకి చెందిన ఒక మానసిక వికలాంగురాలిపై ఇద్దరు ఆటోడ్రైవర్లు.. ఒక బ్యాండ్ మెన్ అత్యాచారానికి పాల్పడ్డారు. తనకు జరిగిన అన్యాయం మీద బాధిత మహిళ సరిగ్గా వివరాలు చెప్పలేకపోవటంతో .. సీసీ కెమేరాల సాయంతో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 19 ఏళ్ల యువతి తన తల్లి సోదరులతో కలిసి ఉంటోంది. ఆమె మానసిక స్దితి సరిగ్గా లేకపోవడంతో బయటకు వెళ్లిపోయేది మళ్లీ తీసుకువచ్చేవారు.

ఆరోజు పురానాపూల్ చౌరస్తా దగ్గర ఆమె నిలబడి ఉంటే.. ఇద్దరు ఆటో డ్రైవర్లు ఖలీమ్ అజీజ్ ఆమెపై కన్నేసి.. ఇంట్లో దిగబెడతామని చెప్పి మూసీ ఒడ్డుకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత జుమ్మెరాత్ బజార్ దగ్గర దించేసి నజీర్ అనే 46 ఏళ్ల బ్యాండ్ మెన్ కు అప్పజెప్పారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో వారు చేసిన పనిని ఆమె సైగలతో చెప్పడంతో దీనిపై పోలీసులకు ఫిర్యాదుచేశారు ఆమె సోదరులు. సీసీ కెమెరాల ఆధారంలో ఆ ముగ్గురు నిందితులని అరెస్ట్ చేశారు.

ఇలాంటి దుర్మార్గులని వదిలిపెట్టకూడదు అని మానసికంగా ఇబ్బంది పడుతున్న అమ్మాయిని కూడా అనుభవించాలనే నీచపు ఆలోచన వీరికి ఉంది అంటే, కచ్చితంగా సమాజంలో చాలా అఘాయిత్యాలకు పాల్పడే ఉంటారు అని, వీరి గురించి పూర్తిగా విచారణ చేయాలి అని మహిళలు కోరుతున్నారు.