దిశకు జరిగిన దారుణం అత్యంత భయం కలిగించేది.. ఆ నరరూప రాక్షసులు సమాజంలో బతకకూడదు అని అందరూ కోరుకున్నారు.. చివరికి పారిపోతూ పోలీసుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు.. అయితే దిశ కేసు తర్వాత ఇంత దారుణం చేసిన ఈ దుర్మార్గుల కేసు పోలీసుల మెడకు చుట్టుకుంది.
సుప్రీం కోర్టు హైకోర్టు స్పెషల్ కమిషన్ దీనిపై విచారణ చేస్తున్నాయి, హెచ్ ఆర్సీ కూడా పోలీసుల చర్యని విమర్శించింది.. చివరకు వారి అంత్యక్రియలకు మోక్షం వచ్చింది.. రీ పోస్టు మార్టం చేశారు ఆ నిందితుల బాడీలకు.
గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ తో పాటు ఎయిమ్స్ వైద్య బృందం కూడా ఈ రీ పోస్టుమార్టం లో పాల్గొంది. రీపోస్టుమార్టం సందర్భంగా నిందితులకు తగిలిన బుల్లెట్ గాయాలపై ఒక క్లారిటీ వచ్చింది… ఏ1 మహమ్మద్ ఆరిఫ్ శరీరంలో నాలుగు బుల్లెట్ గాయాలను గుర్తించారు. ఏ2 చెన్నకేశవులు శరీరంలో మూడు బుల్లెట్లు, ఏ3 నవీన్ శరీరంలో రెండు బుల్లెట్లు, ఏ4 శివ శరీరంలో ఒక బుల్లెట్ గాయాన్ని గుర్తించారు, ఈ రిపోర్టుని ఎవరికి ఇవ్వకుండా కోర్టుకు సీల్డ్ కవర్ లో ఇవ్వనున్నారు.