దీపావళి రోజు దీపాలు ఇలా వెలిగించండి అమ్మవారి పూజ ఇలా చేస్తే మీకు అన్నీ శుభాలే

దీపావళి రోజు దీపాలు ఇలా వెలిగించండి అమ్మవారి పూజ ఇలా చేస్తే మీకు అన్నీ శుభాలే

0
118

దీపావళి అంటే దీపాల పండుగ, ఈరోజు లక్ష్మీ దేవి అమ్మవారిని అందరూ కొలుస్తారు.. నరక చతుర్దశి తర్వాతి రోజు వచ్చే దీపాల పండుగ దీపావళి. శ్రీమహావిష్ణువు వామనుడిగా అవతరించి బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కినందుకు ఈరోజు ప్రజలు సంతోషంగా ఈ దీపావళి పండుగ చేసుకుంటారు, ఇంటి బయట ప్రమిదలులో దీపాలు వెలిగిస్తారు.

మహాలయ పక్షంలో స్వర్గంనుంచి దిగివచ్చి భూలోకంలో తిరిగే పితృదేవతలు, ఈ రోజున పితృలోకానికి తిరిగి వెళతారని, వారికి వెలుతురు చూపించడం కోసం అలా ఆరు బయట దీపాలు వెలిగించే ఆచారం వచ్చిందనేది మరో పురాణ కథనం. మరి ఈ రోజు దీపావళి ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం.

ఉదయం అమ్మవారికి ఆవునేతితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం మంచిది, రాత్రి దీపాల్లో నువ్వుల నూనెతో వెలిగించిన దీపం పెట్టండి. కొవ్వొత్తులు కాదు దీపాలు మాత్రమే వెలిగించండి. ఉదయం 5 గంటలకు స్నానం చేయాలి, ఉదయం అమ్మవారికి పూజచేసి లక్ష్మీదేవికి పూలు అలంకరించాలి.. అలాగే మీ దగ్గర ఉన్న నగలు అమ్మవారికి అలంకరించండి.

ఇక సాయంత్రం లక్ష్మీదేవిని పూజించే సమయంలో ముందు వినాయకుడిని పూజించి తర్వాత లక్ష్మీదేవిని పూజించండి, ఈ రోజు ఎర్రటి చీర పసుపు బట్టలు కట్టుకున్నా మంచిది.. నల్లటి గోదుమరంగు వస్త్రాలు వద్దు, ఇక దీపాలు సాయంత్రం ఆరుగంటలకు వెలిగించాలి. ఇక సరిసంఖ్య కలిగిన దీపాలు మాత్రమే వెలిగించాలి, రెండు నాలుగు ఆరు ఎనిమిది పది ఇలా.