దేశంలో వైరల్ అవుతున్న దుర్గ్ ప్రాంతం – అసలు అక్కడ ఏం జరుగుతోంది.

దేశంలో వైరల్ అవుతున్న దుర్గ్ ప్రాంతం - అసలు అక్కడ ఏం జరుగుతోంది.

0
92

దేశంలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి.. ఎక్కడ చూసినా భారీగా కేసులు బయట పడుతున్నాయి.. ముఖ్యంగా మహారాష్ట్రాలో వేలాది కేసులు బయటపడుతున్నాయి, ఇక దేశంలో వస్తున్న కేసుల్లో సగం కేసులు ఇక్కడ నుంచి వస్తున్నాయి.. ముంబయి, పుణె, నాగ్పూర్, దిల్లీలో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి.

 

అయితే ఇప్పుడు మరో ప్రాంతం పేరు బాగా వినిపిస్తోంది.ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాలో కోవిడ్ కరాళనృత్యం చేస్తోంది.

దారుణంగా కేసులు బయటపడుతున్నాయి, వారంలోనే 38 మంది మృత్యు ఒడికి చేరుకున్నారు. స్టేట్ లో ఆరువేల కేసులు చేరాయి.

 

కేసులు భారీగా పెరగడంతో జిల్లా యంత్రాంగం ఏప్రిల్ 6 నుంచి 14 వరకు పూర్తి స్థాయి లాక్డౌన్ను అమలు చేయనుంది… ఇక ఆస్పత్రులు కోవిడ్ పేషెంట్లతో నిండిపోతున్నాయి….ఏప్రిల్ 2న ఒక్క దుర్గ్ జిల్లాలోనే 964 మందికి వైరస్ సోకింది. వారం రోజుల్లో ఏకంగా ఆరువేల కేసులు నమోదు అయ్యాయి… మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. లాక్ డౌన్ వల్ల పరిస్దితిలో మార్పు వస్తుంది అని చూస్తున్నారు ఇక్కడ అధికారులు.