తిరుమల: పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాల వివరాలివే..

0
108

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాల రిపోర్ట్ ఈ కింది విధంగా ఉన్నాయి. పది రోజుల్లో 3.79 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం లభించింది. ఎస్సి, ఎస్టీ, బిసీ,‌ మత్స్యకారులకు 6,948 మందికి ఉచిత రవాణా, వసతితో పాటు దర్శనం కల్పించాం.

అలిపిరి నడక‌ మార్గంలో 26,420 మంది భక్తులు నడకసాగించారు. 15.14 లక్షల లడ్డులు భక్తులు కొనుగోలు చేశారు. పది రోజుల్లో 26.61 కోట్ల హుండి ఆదాయం లభించింది. గదుల ద్వారా 4.68 కోట్లు టిటిడికి సమకూరింది. 1.23 లక్షలమంది తలనీలాలు సమర్పించారు. తిరుమల అన్నదాన సత్రం ద్వారా 4.58 లక్షలమంది భక్తలకు భోజనాలు కల్పించారు.