ఈ ముగ్గురు స్నేహితులు దేవుడ్ని నమ్మరు, దేవుడి ఆలయాల్లో అపవిత్ర పనులు చేశారు, అయితే ఇందులో ఓ వ్యక్తి దేవుడి హుండీలో కండోమ్ ప్యాకెట్ వేశాడు, దీంతో అతను కొద్ది రోజులకి ప్రాణాలు కోల్పోయాడు, ఆ దేవుడి శాపం వల్ల చేసిన తప్పు వల్ల ఇలాంటి పరిస్దితి వచ్చింది అని ప్రాణభయంతో మరో ఇద్దరు స్నేహితులు వెంటనే చేసిన తప్పుని ఒప్పుకుని శిక్ష వేయమని దేవుడి ముందు ఒప్పుకున్నారు.
మంగళూరులోని సుప్రసిద్ధ కొరగజ్జ దేవాలయం హుండీలో అభ్యంతరకమైన పదార్థాలను వేసినవారిలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు లొంగిపోయారు. నవాజ్, తౌఫీక్, అబ్దుల్ రహీం ఇటీవల అపవిత్రమైన పదార్థాలను వేశారు. కొద్ది రోజులకి తీవ్ర అస్వస్థతకు గురైన నవాజ్ చనిపోయాడు, ఇక చనిపోయే ముందు తన అనారోగ్యానికి కారణం దేవుని మహిమేనని మిగిలిన ఇద్దరు నిందితులకు చెప్పాడట.
ఇటీవల తౌఫీక్ కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు , దీంతో తౌఫీక్, అబ్దుల్ రహీం భయపడి కొరగజ్జ దేవాలయం అర్చకుని దగ్గరకు వెళ్ళి తాము తప్పు చేశామని అంగీకరించారు… చివరకు పోలీసులకు లొంగిపోయారు.. వీరు మూడు దేవాలయాల్లో ఈ విధంగా అపవిత్రమైన పదార్థాలను వేశారు అని తేలింది.