దీపావళి రోజు పిల్లలు కొట్టే దివిటీలకు ఈ కర్రలు వాడండి – ఈ పాట పాడించండి

దీపావళి రోజు పిల్లలు కొట్టే దివిటీలకు ఈ కర్రలు వాడండి - ఈ పాట పాడించండి

0
123

ఈ దివిటీలు అనేది దీపావళి రోజు పిల్లల చేత చేయిస్తారు, ముఖ్యంగా పిల్లల చేత ఈ దివిటీలు కొట్టిస్తారు అనేది తెలిసిందే..
ఈ దివిటీలు కొట్టడానికి గోగుకర్రలు కాని చెరకు కర్రలు కాని, ఆముదపు కర్రలు గాని ఉపయోగిస్తారు. వీటిలో ఏది అయినా సరే వాడవచ్చు, ముఖ్యంగా నూనెలో నానబెట్టిన వత్తులు ఈ కర్రపై పెట్టి వాటిని వెలిగిస్తారు.

పెళ్లికాని ఆడపిల్లలు, వడుగు కాని మగపిల్లలు చిన్నవాళ్లు మాత్రమే ఈ ప్రక్రియ జరుపుతారు. ఆ దివిటీలు కొట్టేటప్పడు
దుబ్బూ దుబ్బూ దీపావళీ
మళ్లీ వచ్చే నాగుల చవితి
ఫుట్టవిూద పాట్ట కర్ర
పట్టకురా బావమరిది
అనే పాట పాడుతారు. ఇక ఇలా పాట పాడి వెంటనే పిల్లలు చేతులు కాళ్లు కడుక్కుని ఏదైనా తీపి పదార్దాం తీసుకోవాలి, చాలా మంది ధనవంతులు వెండితో చేసిన కర్రలతో కూడా ఇలాంటివి కొట్టిస్తారు, పెద్దలకు వెలుగు చూపించడానికి ఈ ఆచారం పాటిస్తాం, పితృదేవతలకు వెలుగుచూపించే నిమిత్తం వేసే దివిటీలు ఏనాటి నుంచో పిల్లల చేత చేయిస్తున్నారు.