కైలాస పర్వతం విశేషాలు మీకు తెలుసా

Did you know about Kailash Mount ?

0
77

కైలాస పర్వతం దీని గురించి చాలా మంది ఒకటే చెబుతారు ఎంతో ఎత్తైన అత్యంత క్లిష్టమైన పర్వతం అని. అంతేకాదు ఇక్కడ దేవుళ్లు ఉంటారు అని. ఈ పర్వతం స్వర్గానికి వెళ్లే నిచ్చెన అంటారు. టిబెట్ పీఠభూమి నుంచి 22,000 అడుగుల దూరంలో ఉంటుంది ఇది . సముద్ర మట్టానికి దాదాపు 6,656 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీని చుట్టు ఎన్నో గుహలు ఉన్నాయి.
ఇక్కడ పవిత్ర రుషులు నివసిస్తారని చెబుతారు.

హిందువులు కైలాస పర్వతాన్ని శివుని పవిత్ర నివాసంగా పరిగణిస్తారు. ప్రతీ ఏడాది చాలా మంది ఈ పర్వత యాత్రకి వస్తారు. అయితే కొందరు మాత్రమే ఈ ప్రదక్షిణను పూర్తి చేస్తారు. కైలాస పర్వతంపై ట్రెక్కింగ్ చేయరు ఎందుకంటే దీనిని చాలా పవిత్రంగా భావిస్తారు.కైలాస పర్వతం దగ్గర మానస సరోవర్, రాక్షస తాల్ అనే రెండు అందమైన సరస్సులు ఉన్నాయి.

మానస సరోవరం ప్రపంచంలోనే ఎత్తైన మంచినీటి సరస్సుగా చెబుతారు. ఇక్కడ నుంచి కిందకి వచ్చాక చేతి గోళ్లు కొన్ని మిల్లీమీటర్లు పెరుగుతాయట. కైలాస పర్వత శిఖరంపై కొలువైన డెమ్చొక్ బుద్ధుని ఉగ్రరూపం బౌద్ధ మతస్థులు పూజిస్తుంటారు. గురునానక్ ఇక్కడే ధ్యానం చేశారని చాలా మంది చెబుతారు.