దిశ ఘటన స్థలంలో పోలీసులకు ఏం వస్తువులు దొరికాయో తెలుసా

దిశ ఘటన స్థలంలో పోలీసులకు ఏం వస్తువులు దొరికాయో తెలుసా

0
101

ఇటీవల శంషాబాద్ లో నలుగురు కామాంధుల చేతుల్లో అత్యంత పాశవికంగా అత్యాచానికి, హత్యకు గురైన వెటర్నరి డాక్టర్ దిశ కేసులో నలుగురు నిందితులు పోలీసుల కాల్పుల్లో మరణించారనే విషయం తెలిసిందే, అయితే ఆమెకు సంబంధించిన కొన్ని వస్తువులు అక్కడ ఉండటంతో ఆమె మరణించింది అని వెంటనే నిర్ధారించుకున్నారు పోలీసులు.

సంఘటన చోటు చేసుకున్న స్థలం నుంచి సేకరించిన కొన్ని కీలక ఆధారాలు, వస్తువులను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి ఆరోజు పంపించారు.
దిశ ధరించిన చెప్పులు, ఆమె ఐడీ కార్డు, దుస్తులు, ఇందులో ఉన్నాయి, అలాగే ఆమె ఆధార్ కార్డ్, అలాగే పరసు కూడా ఉంది.
వాటితో పాటు ఖాళీ మద్యం బాటిళ్లు, దిశ మృతదేహాన్ని దగ్ధం చేయడానికి పెట్రోల్ ను తీసుకొచ్చిన ప్లాస్టిక్ బాటిల్ కూడా ఇందులో ఉన్నాయి.

వాటితో పాటు క్లూస్ టీమ్ సేకరించిన కొన్ని వస్తువులను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఆమె వస్తువులు అక్కడ దొరకడంతో ఆమెపై దారుణానికి పాల్పడి ఉంటారు అని పోలీసులు ముందు భావించారు, దీంతో తర్వాత రోజు తెల్లవారు జామున ఆమె శవం కాలిపోతూ కనిపించింది, ఇంతటి దారుణం దుర్మార్గానికి పాల్పడిన వారు చివరకు పారిపోతూ పోలీసుల చేతిలో హతమయ్యారు.