దిషకు జరిగిన అన్యాయపు సంఘటన దేశంలో సంచలనం రేపింది , ఆమె హత్య కేసు విషయంలో నింధితులకు దారుణమైన శిక్షలు వేయాలని కోరుతున్నారు ప్రజలు…దిష ఘటనపై దేశంలో మహిళలు పెద్ద ఎత్తున నిరసన తెలియచేశారు. దిష ఓ పశువైద్యశాలలో వెటర్నరీ డాక్టర్ గా పని చేస్తోంది. దిషకు సంబంధించిన పాత జ్ఞాపకాలను పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ఆమెకు ఓరుగల్లుతోనూ అనుబంధం ఉందట.
ఎందుకంటే.. దిశ 8 నుంచి 10వ తరగతి వరకు హసన్పర్తి మండలం ఎర్రగట్టు గుట్ట సమీపంలోని గ్రీన్వుడ్ పాఠశాలలో చదివుకుందట. 2006లో ఎనిమిదో తరగతిలో చేరిన దిశ అక్కడ హాస్టల్ లో ఉండి విద్యాభ్యాసం పదో తరగతి వరకూ పూర్తి చేసుకుందట. దిశకు పదో తరగతిలో 536 మార్కులు వచ్చాయట. పాఠశాల డైరెక్టర్ భరద్వాజనాయుడు ఆమె జ్ఞాపకాలను మీడియాతో పంచుకున్నారు. అలాగే సేవ చేయడంలో ఆమె పలు అవార్డులు కూడా అందుకున్నారట.
దిశ చాల మంచిది అని ఆమెకు ఇలా జరగడం తట్టుకోలేకపోతున్నాము అంటున్నారు ఆమె కుటుంబ సభ్యులు, ఇంత దారుణాకిని పాల్పడిన వారికి శిక్షలు కూడా కఠినంగా వేయాలని కోరుతున్నారు.. మరో పక్క ఈ కేసులో వారికి శిక్ష పడేలా పోలీసులు రిపోర్ట్ సిద్దం చేశారు, వారి తరపున లాయర్లు కూడా వాధించేందుకు లేకపోవడంతో వారికి బయటపడే అవకాశం లేదు అని తెలుస్తోంది.