చెన్నకేశవుల భార్య మాటలకు దిశ సోదరి ఏమంటోందంటే

చెన్నకేశవుల భార్య మాటలకు దిశ సోదరి ఏమంటోందంటే

0
101

దిశ కుటుంబం తన కూమార్తె లేదు అని కన్నీరు పెడుతోంది.. అయితే నిందితుల కుటుంబాలు కూడా తమ జీవితం ఎలా ముందుకు సాగుతుంది అని బాధపడుతున్నాయి. ఓ పక్క తమని చూసేవారు లేరు అని క్షోభిస్తున్నారు, అయితే తన అక్క ఏ తప్పు చేయకుండా చనిపోయింది అని దిశ సోదరి కన్నీరు పెడుతోంది, ఓ మీడియా సమావేశంలో కొన్ని రోజుల క్రితం రేణుక దిశ సోదరి కూడా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ నలుగురు తప్పు చేసిన తర్వాత శిక్ష పడింది, నా అక్క పని చేసుకుంటూ వస్తుంటే చంపేశారు…నా అక్క తప్పు చేయకుండా చంపేశారు… ఆ అబ్బాయిలు తప్పు చేశారు అలాంటి వారిని సమర్ధించడం కూడా తప్పు అంటూ దిశ సోదరి తెలిపింది, తన అక్కకి అన్యాయం జరిగిన సమయంలో హెచ్ ఆర్సీ వారు ఎందుకు ప్రశ్నించలేదు.

మరి ఆ రోజు ఎందుకు వీరు రాలేదు అడగలేదు అని తన బాధ వెళ్లగక్కింది…తన అక్క చనిపోయింది అని బాధపడుతోంది.. మాకు కూడా చివరి చూపు దక్కలేదు అని ఆమె తెలిపింది.