ఒకే నెలలో దిష్టి గుమ్మడికాయ రెండు సార్లు కుళ్లిపోతే అరిష్టమా ఏం చేయాలి

ఒకే నెలలో దిష్టి గుమ్మడికాయ రెండు సార్లు కుళ్లిపోతే అరిష్టమా ఏం చేయాలి

0
687

దిష్టి గుమ్మడికాయ అంటే బూడిద గుమ్మడికాయ.. ఇంటికి కడుతూ ఉంటాం ఇంటిలోకి నరదిష్టి తగలకుండా ఇది కడుతారు, అయితే ఒక్కోసారి కట్టిన వారానికి కూడా ఇది కుళ్లిపోతే కచ్చితంగా ఆ ఇంట్లో నెగిటీవ్ ఎనర్జీ నరదిష్టి ఎక్కువ ఉంది అని అర్దం.

బూడిద గుమ్మడికాయలు కడుతున్నప్పుడల్లా కొద్ది రోజులకే కుల్లిపోతున్నాయంటే మీ ఇంటి మీద ఎక్కువగా నరఘోష, నరదిష్టి, నరపీడ ఉందని మీరు కచ్చితంగా గ్రహించాలి, ఇలాంటి సమయంలో సాధారణంగా కట్టకుండా బూడిద గుమ్మడికాయ తీసుకొని దానికి అనుభవజ్ఞులైన పండితులచే శాస్త్రోకంగా కూశ్మండ పూజ చేయించుకుని ఇంటి ప్రధాన ద్వారం పైన ఉట్టిలో వేలాడదీయండి.

ఇక ముఖ్యమైన విషయం మీరు వ్యాపారం చేసే దగ్గర , ఫ్యాక్టరీ దగ్గర ఇంటికి ముందు కట్టిన గుమ్మడికాయ
ఒక సంవత్సరం దాటితే తప్పక తీసివేయాలి. గుమ్మడికాయ ఇంటికి ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు గుర్తు. ఇక నెలలో రెండుసార్లు ఇలా కుళ్లిపోతే అదే నెలలో మూడో గుమ్మడి కాయ కట్టకూడదు, తర్వాత నెలలోనే కట్టాలి.